అవసర సంస్థ
Q1 2026 కార్యాచరణ ప్రణాళిక
అవసర సంస్థను స్థాపించి, కార్యక్రమాలు ప్రారంభించి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో మీరు అందించిన ప్రోత్సాహం, మీరు చూపించిన ఉత్సాహం, చేసిన ఆర్థిక సహాయం, మాకు ఎవరికీ విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఇంకా మంచి కార్యక్రమ ప్రణాళికలతో మీ ముందు వచ్చేలా చేస్తున్నాయి.
2026 సంవత్సరపు మొదటి మూడు నెలలకు గాను, అంటే, మార్చి నెలలోపు, ఈ క్రింది మూడు కార్యక్రమాలు అవసర సంస్థ చేపడుతుంది. అందుకు కావలసిన వనరుల వివరాలు ఈ క్రింద ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు, శ్రీమోభిలాషులు, సభ్యులు అందరూ ఈ సత్యార్థాలకు నడుం బిగించి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన.
గాయత్రి నామసంఖ్యాక శ్రీరామకోటి మహాయజ్ఞం
శ్రీరామకోటి పుస్తకాలను ప్రచురించి భద్రాచల దేవస్థానం ద్వారా ఉచితంగా పంపిణీ చేసి కార్యక్రమంలో మీరూ భాగస్వామ్యం వహించవచ్చు. మీకు రాసే అవకాశం లేకపోయినా మీ ద్రవ్యాన్ని వెచ్చించి రాసేవారికి సౌకర్యాన్ని కల్పించి ప్రోత్సహించవచ్చు.
500 పుస్తకాల కంటే ఎక్కువ ప్రతులకు, మీరు సూచించిన పేర్లను పుస్తకాలపై దాతలుగా ముద్రించి మరీ అందిస్తాం.
ముక్కోటి ఏకాదశి రామాయణ పుస్తక పంపిణీ
ముక్కోటి ఏకాదశి పర్వ దినాన, Dec 30 నాడు, అవసర సంస్థ శ్రీ రామచంద్ర మూర్తి ప్రాశస్త్యాన్ని, ప్రాభవాన్ని చాటి చెపుతూ, భద్రాచలంలో 10,000 రామాయణ ప్రతుల పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టింది.
లక్ష్యం
10,000 రామాయణ పుస్తకాలు
విరాళం
కనీసం $500 - రూ. 50,000
(100 రామాయణ ప్రతులు)
భక్తులు, దాతలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడవలసిందిగా ప్రార్థన.
ఇతర కార్యక్రమ విరాళాలు
అవసర సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది, ఆర్ష విజ్ఞాన పునరుద్ధరణకై. దాతలు, సభ్యులు పైన పేర్కొన్న కార్యక్రమాలకు కాకుండా మరో ఇతర కార్యక్రమాలకు గానీ, లేక యధాశక్తి ఇవ్వ దలచిన గానీ, మేము ఆ సోమ్యును అలానే మంచి కార్యక్రమాలకు వినియోగించగలము.
అమెరికా దేశంలో నివసించే దాతలు ఈ సంవత్సరాంతంలోగా కార్పొరేట్ మాచింగ్ సౌకర్యాన్ని వాడుకుని తమ విరాళాన్ని రెట్టింపు చేసే అవకాశాన్ని పూర్తిగా వాడుకోగలరని విన్నపం.
విరాళాలు పంపడానికి వివరాలు
మీరు కార్డులు, నెట్ బ్యాంకింగ్, డెబిల్, క్రెడిట్ కార్డులు, paypal, zelle ఇత్యాది మార్గాల ద్వారా మీ విరాళం పంపవచ్చు.
అదనపు వివరాలకై ఈ లింక్ ను చూడండి -
సంప్రదించండి: +91 94402 65197 / info@avasaratrust.org
Unique Id of VO/NGO - AP/2024/0452049
Reg. No. AP14108671935593W