ఆర్ష విజ్ఞాన అధునాతన అధ్యయన మరియు పరిశోధనా సంస్థ

తెలుగు భాష ద్వారా భారతీయ వాఙ్మయాన్ని సరళమూ, సుందరమూ చేసి అందించాలన్న లక్ష్యంతో ఏర్పడిందే “అవసర”.

మన సంస్థ నేటికే కాక రాబోయే తరాలకు కూడా మన విజ్ఞానాన్ని యోగ్యమైన రీతిలో అందించాలని కృషి చేస్తుంది.

మా లక్ష్యం

వేదాధ్యయనం, సంస్కృత భాషా పరివ్యాప్తికి తోడ్పడడం; ప్రాచీన సాహిత్యానువాదం, ప్రచురణ ద్వారా అమూల్యమైన గ్రంథాలను, కావ్యాలను ముందు తరాలకు అందించడం; కళలను ప్రోత్సహించడం; విశ్వశ్రేయస్సును కాంక్షించి ఆధ్యాత్మిక -సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరేతర అనుబంధ కార్యక్రమాలు, కార్యశాలలు నిర్వహించడం.

భావి తరాలకు చేయూత

పరిశోధనా అవకాశాలను మెరుగుపరచడం; సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భవిష్యత్తరాలకు పండితులను, నాయకులను, సంస్కర్తలను అందజేయడం; సంప్రదాయ ఆవిష్కరణలు ప్రోత్సహించడం; భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను పరిరక్షించడం.

మా మౌలిక విలువలు

పరిరక్షణ

ప్రాచీన వేదవిజ్ఞానాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించి భావితరాలకు అందజేయడం.

విద్య

ఆధునిక పద్ధతుల్లో వేదవిజ్ఞానాన్ని, సంస్కృత భాషను, ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం.

సమూహం

పండితులు, అధ్యాపకులు, ఆధ్యాత్మిక అన్వేషకులతో విశ్వజాలాన్ని నిర్మించడం.

ప్రచురణ

జ్ఞాన ప్రసారకాలైన గ్రంథాలను, కావ్యాలను, శాస్త్రాలను, వ్యాసాలను ప్రచురించడం, అనువాదం చేయడం.

వేదవిద్య, సంస్కృతి ప్రచారం

వేదవిద్య, సంస్కృత, తెలుగు భాషా సాహిత్యాల వ్యాప్తికీ కృషి చేయడం; సాంస్కృతిక సామాజిక సంక్షేమ కోసం పాటుపడడం.

ఉపకృతి, పురస్కృతి

వేదవిద్య, సంస్కృత భాషలో ఉన్నత విద్య కోసం, పరిశోధనల కోసం ఉపకార వేతనాలు, పురస్కారాలు అందించడం.

వేదవిజ్ఞాన పరిరక్షణ, విస్తరణ

వేదోక్తమైన నిరాడంబర జీవనవిధానానికి, సచ్ఛీల నిర్మాణానికి ప్రోత్సాహం ఇవ్వడం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ధ్యాన గోష్ఠులు నిర్వహించడం.

భారతీయ సంస్కృతి, కళల వృద్ధి

పురాణ, ఇతిహాస, ఇతర సంప్రదాయ గ్రంథాల రచన, అధ్యయనం, ప్రచార కార్యక్రమాల నిర్వహణ, సంస్కృత, తెలుగు భాషాభివృద్ధికి తరగతులు, కార్యశాలలు, ఇతర కార్యక్రమాల నిర్వహణ.

ప్రాచీన గ్రంథాల ప్రచురణ, అనువాదం:

సంస్కృత భాషలో ఉన్న వైదిక, పౌరాణిక, ఐతిహాసిక, ఇతర శాస్త్రగ్రంథాలను స్థానిక భాషలలోకి అనువదించి, ప్రచురించడం తద్వారా ప్రాచీన వాఙ్మయ ప్రచారం.

డాక్టర్ అద్దంకి శ్రీనివాస్

(ట్రస్ట్ చైర్మన్)

డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ Ph.D.(తెలుగు), M.A. (తెలుగు), M.A. (సంస్కృతం), మరియు M.A (భాషాశాస్త్రం) - సుప్రసిద్ధ పండితులు, కవి, పరిశోధకులు. విద్యావేత్తగా, రచయితగా, సంపాదకునిగా కృషిచేస్తున్న వారు. తెలుగు భాష, వ్యాకరణం, శాస్త్రీయ కవిత్వం, తులనాత్మక సాహిత్యం, సాహిత్య విమర్శ, భాషాశాస్త్రం మరియు అనువాదానికి సంబంధించిన అంశాలలో వారు అనేక రచనలు చేశారు.

వారు భారతీయ సనాతన ధర్మం, మహాభారతం, రామాయణం, భాగవతం, శ్రీరామకర్ణామృతం, ఉత్తరరామాయణం, కేయూరబాహుచరిత్ర, చారుచర్య, విజ్ఞానేశ్వరము మొదలైన అనేక గ్రంథాలు రచించారు. ఇవన్నీ ఆర్షవిజ్ఞానాన్ని అందులోని గొప్పతనాన్ని ప్రకటించేవే. వీరు తమ ప్రసంగాల ద్వారా కూడా భాషాసాహిత్యాలకు సేవ చేస్తున్నారు.

వారి సేవలకు గుర్తింపుగా, వారు 2019లో ప్రతిష్ఠాత్మకమైన మహర్షి బాదరాయణ్ వ్యాస్ సమ్మాన్ అవార్డు (క్లాసికల్ తెలుగులో ప్రెసిడెంట్ అవార్డు) పొందారు. నవభారత రత్న, కవిరత్న, మరియు వేగావతి వీరి ఇతర బిరుదులు.

వారి రచనలు ఇప్పటిదాకా 90 కి పైగా ప్రచురించిన పుస్తకాలు వెలుగు చూశాయి. ఇంకా 500 కంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నాయి.

Dr. Addanki Srinivas

చేయూత

మా లక్ష్యాలు, ప్రణాళికలు మీకు నచ్చితే సత్వరమే స్పందించ ప్రార్థన. మీ స్పందనని అమూల్యమైన అభిప్రాయాల రూపంలో, విరాళాల రూపంలో తెలుపండి.

విరాళాలు