ఆర్షవిజ్ఞాన అధునాతన అధ్యయనం మరియు భాషా పరిశోధన

సచ్ఛీల నిర్మాణం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఇంకా భారతీయ విలువలతో కూడిన సంప్రదాయాలకు ‘అవసర’ ఇస్తుంది ప్రోత్సాహం.

  • మా లక్ష్యం

    వేదాధ్యయనం, సంస్కృత భాషా పరివ్యాప్తికి తోడ్పడడం; ప్రాచీన సాహిత్యానువాదం, ప్రచురణ ద్వారా అమూల్యమైన గ్రంథాలను, కావ్యాలను ముందు తరాలకు అందించడం, కళలను ప్రోత్సహించడం, విశ్వశ్రేయస్సును కాంక్షించి ఆధ్యాత్మిక -సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరేతర అనుబంధ కార్యక్రమాలు, కార్యశాలలు నిర్వహించడం.

  • భావి తరాలకు చేయూత

    పరిశోధనా అవకాశాలను మెరుగుపరచడం; సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భవిష్యత్తరాలకు పండితులను, నాయకులను, సంస్కర్తలను అందజేయడం, సంప్రదాయ ఆవిష్కరణలు ప్రోత్సహించడం; భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను పరిరక్షించడం.

  • సమాజ శ్రేయస్సు, అభివృద్ధి

    సమస్త మానవాళికి ఉపయోగపడే విధంగా ఆలయాలు, వేద పాఠశాలల నిర్మాణ, నిర్వహణా కార్యక్రమాలు యథావకాశంగా నిర్వహించడం; సనాతన ధర్మ పరిశీలన, వైదిక వాఙ్మయ పరిరక్షణ, ప్రచారం, బోధన అందించే దిశగా విద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, గ్రంథాలయాలను ప్రోత్సహించడం.

  • భారతీయ సంస్కృతి, కళల వృద్ధి

    పురాణ, ఇతిహాస, ఇతర సంప్రదాయ గ్రంథాల అధ్యయనం, ప్రచారం; తరగతులు, కార్యశాలలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించి తద్వారా సంస్కృత, తెలుగు భాషల వ్యాప్తికి కృషిచేయడం.

ఈ రోజే అవసర ట్రస్టుకు విరాళాలు ఇవ్వండి

అవసరార్థుల అవసరం తీర్చడమే మా ‘అవసర’ ప్రధాన లక్ష్యం. ఉదారమైన మీ సహకారం మా లక్ష్యసాధనను సులభతరం చేసి, మరింత ఉత్సాహాన్నిచ్చి ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. మీ సహాయం ఎన్నో జీవితాలలో ఎన్నెన్నో మార్పులను తీసుకురాగలదు. వైదిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడంలో మాకు ఇతోధిక సహాయం చేయగలదు. అంతేకాక శాశ్వతమైన విలువలను ప్రచారం చేసే గ్రంథాల రూపంలోనూ, కార్యక్రమాల రూపంలోనూ, చిరకాలం లోకంలో జ్ఞానదానం చేయగలదు.

విరాళాలు