నవంబర్ 4వ తేదీన, హైదరగూడలోని సెయింట్ పాల్స్ హై స్కూల్‌లో నిర్వహించిన ఉదయపు అసెంబ్లీలో, హై స్కూల్ తెలుగు భాషా టాపర్ విద్యార్థులకు "శతక దర్శనం" ప్రతులను అందజేశారు.
అమెరికా, టాంపా నగరానికి చెందిన డా. చూండూరి అపర్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని, సంవత్సరం క్రితం పరమపదించిన తన తల్లి శ్రీమతి చుండూరి మీనాక్షి దేవి గారి స్మరణార్థంగా ఈ పుస్తకాలను విద్యార్థులకు అందించారు. శ్రీమతి మీనాక్షి దేవి గారు సెయింట్ పాల్స్ హై స్కూల్‌లో 25 సంవత్సరాల పాటు తెలుగు అధ్యాపకులుగా సేవలందించారు.
ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన ప్రిన్సిపాల్ బ్రదర్ సుధాకర్ రెడ్డి గారికి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ శ్రీమతి సుజు థామస్ గారికి, అలాగే తెలుగు విభాగానికి చూండూరి కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
కార్యక్రమానికి అవసరమైన స్మారక గ్రంథాల ముద్రణ మరియు సరఫరాలో సహాయపడ్డ ప్రొఫెసర్ అద్దంకి శ్రీనివాస్ గారికి, అవసర ట్రస్ట్ చైర్మన్‌గా వారి సహకారం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు చుండూరి అపర్ణ.