భవిష్యత్ ప్రచురణలు

మనకు ఉన్న ఎన్నో అద్భుత గ్రంథాలు నేడు అనేకానేక కారణాల వలన చాలా మందికి అర్ధం కాని స్థితిలో ఉన్నాయి. అలాంటి మహత్తరమైన పరిజ్ఞానం, దాని సారం సులభంగా, సుందరంగా నేటి తరాలకి, భావితరాలకి అందించాలన్నదే మా లక్ష్యం.

వేద దర్శనం

చతుర్వేదాలను, అందులోని అంతర్భాగాలను సంక్షిప్తంగా వివరించి అందరికీ చతుర్వేదాల గురించి పరిచయం చేసే గ్రంథం. ఆయా వేదాలలో నిష్ణాతులు, నిత్యం అధ్యయనం చేసే వేదపండితులే దీనిని రచించారు. ఈ గ్రంథాన్ని డా. అద్దంకి శ్రీనివాస్ గారు సంపాదకులుగా అందరికీ ఆమోదయోగ్యంగా అందిస్తారు.
Pages : 500

Costs : ₹200000

(గ్రంథ రచన + ముద్రణ + వేదపండిత సన్మానం + పంపిణీ వ్యయం)
₹20000 సేకరించబడ్డాయి
10% అయినది

శతక దర్శనం

తెలుగు సాహిత్యంలో ఉన్న సుప్రసిద్ధమైన 18 శతకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలను వివరించే గ్రంధం. గ్రంధం ముద్రించి, పాఠాశాలలకు పంపిణీ చేయాలన్నది ముఖ్య ఆశయం.

Costs : ₹50000

(100 ప్రతుల వితరణకు)
₹4000 సేకరించబడ్డాయి
8% అయినది

రామాయణ, భారత, భాగవతాలు

ఈ మూడు గ్రంథాలు ప్రతి ఇంటిలోనూ పిల్లలకు, యువకులకు, పెద్దలకు అర్ధమయ్యే విధంగా మూడు స్థాయిలలో (ఉదా: బాలలకు తేలిక భాషలో సంక్షిప్తంగా) సిద్ధంచేసి అందరికీ అందించే అద్భుతమైన కార్యక్రమం. మీ పేరుపై వివిధ ధర్మకార్యక్రమాలకు, దేవాలయాలలోనూ వితరణ చేయడం జరుగుతుంది.

Costs : ₹204464

1. బాలల రామాయణ, భారత, భాగవతాలు - 100 ప్రతులు - Rs. 11,116/-

2. మధ్యస్థాయి రామాయణ, భారత, భాగవతాలు - 100 ప్రతులు - Rs. 51,116/-

3. సంపూర్ణ రామాయణ, భారత, భాగవతాలు - 100 ప్రతులు - Rs. 1,11,116/-

4. రామాయణ, భారత, భాగవతాలు (ఆంగ్ల అనువాదం) - 100 ప్రతులు - Rs. 31,116/-

500, 1000 ప్రతులు సమర్పించేవారి ముఖచిత్రాన్ని గ్రంథముద్రణ సహాయకులుగా ముద్రించి అందరికీ స్ఫూర్తిని కలిగించడం జరుగుతుంది

₹12000 సేకరించబడ్డాయి
6% అయినది

గజేంద్ర మోక్షం

వ్యాస - పోతన భాగవతాలు మరియు వివిధ సంప్రదాయాలలో ఉన్న గజేంద్ర మోక్ష ఘట్టానికి డా. అద్దంకి శ్రీనివాస్ గారు కావ్యపాఠం ద్వారా చేసిన విశేష వ్యాఖ్యాన గ్రంథం.

Costs : ₹50000

500 ప్రతులకు, గ్రంథరచనకు డా. శ్రీనివాస్ దేవరకొండ, యూ.ఎస్. వారు సమర్పిస్తున్నారు. మరో 500 ప్రతులను ఎవరైనా సమర్పించవచ్చు.
₹2000 సేకరించబడ్డాయి
4% అయినది

వరాహపురాణం

సంస్కృత- ఆంధ్ర సాహిత్యాలలోని మహాపురాణ విశేషాలన్నింటినీ క్రోడీకరించి, ప్రతి ఒక్కరూ రోజూ పారాయణ చేయడానికి వీలుగా రచించిన గ్రంథం.

Costs : ₹200000

(గ్రంథ రచన, డీటీపీ, ముద్రణ)
₹2000 సేకరించబడ్డాయి
1% అయినది

అల్లసాని పెద్దన - మనుచరిత్రము

ఈనాటి పాఠకులను దృష్టిలో ఉంచుకొని పూర్వ వ్యాఖ్యాతలు చేసిన వ్యాఖ్యావిశేషాలనే కాక, మరిన్ని కొత్త విశేషాలతో డా. అద్దంకి శ్రీనివాస్ గారు చేస్తున్న పాఠక మిత్రవ్యాఖ్య. రచనలో ఉన్నది.

Costs : ₹200000

(అంచనా - అన్నీ కలిపి)
₹2000 సేకరించబడ్డాయి
1% అయినది

పూర్వగాథాలహరి

పురాణాలలో ఉన్న పాత్రల వివరాలను తెలిపే అద్భుత గ్రంథం. 5 వేలకుపైగా కొత్త ఆరోపాలతో సిద్ధం కాబోతోంది.
Pages : 1000

Costs : ₹200000

₹2000 సేకరించబడ్డాయి
1% అయినది
Sanatana Dharmam

పూర్వ ప్రచురణలు

తెలుగు, సంస్కృత భాషలలో వచ్చిన ప్రాచీన గ్రంధాలలోని విజ్ఞానాన్ని పరిశోధించి సులభంగా భావితరాలకు అందించే మా గ్రంథాలను ఇక్కడ అందిస్తున్నాం. ఈ విలువైన వనరులను సంరక్షించడానికి మరియు విస్తృతంగా ప్రేక్షకులతో పంచుకోవడానికి మీ ప్రోత్సాహం అవసరం. ఇంకా మీ విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నాం.

ఈ గ్రంథాలను డిజిటలైజ్ చేయడం మరియు వాటి నేపథ్యం లేదా విద్యా స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వాటిని అందుబాటులో ఉంచడం మా ప్రాథమిక లక్ష్యం. మా ఆశయాల పట్ల ఆసక్తి ఉన్నవారు మాతో కలిసి పనిచేయాలనుకొనేవారు వెంటనే మా సమూహంలో చేరండి.

మా పుస్తకాలు మరియు ప్రచురణలు